Tuesday, January 18, 2011

కధా మంజరి - 1.

మా స్నేహితుడు చాలా కాలం నుంచి వ్రాయమని కోరగా, ఇలా ఈ కధల శీర్షిక మొదలు పెడుతున్నా. పౌరాణిక గాధలు చాల మందికి తెలిసినవే, కాకుంటే , ఈ తరం వాళ్ళకి వాటి గురించి పెద్దగా తెలియదు . వారికి తెలియచేసే ఒక చిన్న ప్రయత్నమే ఈ "కధా మంజరి."

జనక మహారాజు
----------------


జనకుడు అనగానే మనకి గుర్తుకు వచ్చేది సీతా దేవి తండ్రి, మిధిలా నగర మహారాజు, జనక మహరాజు.చాలా మంది దగ్గర "జనక" అనే పదం విన్నాం. జనక అంటే, తండ్రి అని కదా అర్థం .మరి జనకుడికి ఆ పేరు యెందుకు వచ్చిందో చూద్దాం.


పూర్వం "నిమి" అనే ఒక చక్రవర్తి 999 యజ్ఞాలు చెసాడు. సహస్ర(1000) యజ్ఞాలు చేస్తే, ఇంద్ర పదవి లభిస్తుంది. వశిష్తుల వారి ఆధ్వర్యం లొ 999 యజ్ఞాలు చేసిన మహానుభావుడు ఆ నిమి చక్రవర్తి. ఆయన 1000వ యజ్ఞం తలపెట్టగా, ఆ సమయం లో వశిష్తుల వారు దేవ కార్యం మీద దేవ లొకం వెళ్ళటం తటస్థించింది. అప్పుడు నిమి, గౌతమ మహా మునిని,యజ్ఞం చేయించమని ప్రార్థింపగా, ఆయన సంకోచించాడు. అప్పుడు నిమి , పూర్ణ కుంభం వసిష్తుల వారి మీదగానె జరిపిద్దాము అని చెప్పి, యజ్ఞం చేయించటానికి గౌతముల వారిని వొప్పించారు. యాగం మొదలు అయ్యింది.

యజ్ఞం దాదాపు అయిపొయే సమయానికి, వశిష్తుల వారు వచ్చారు. ఆయన ఆగ్రహం పొంది, తాను లేని సమయం లో, ఇంకొక ముని ద్వారా యజ్ఞం జరిపించినందుకు గాను, కోపించి, నిమి చక్రవర్తిని భస్మం అయిపొవలసిందిగా శపించారు. అప్పుడు నిమి తిరిగి వసిష్తుల వారిని కూడా నిర్జీవం కమ్మని శపించారు. ఈ విధంగా ఇద్దరూ మరణించి బ్రహ్మ లోకం వెల్లగా, బ్రహ్మ వారి వాదనలు విన్నాడు. విని, ఇద్దర్నీ క్షమిస్తున్నాను, వరం కొరుకొ మంటాడు. అప్పుడు వసిష్తుల వారు తిరిగి తన శరీరం లోకి ప్రవేశాన్ని కొరుకుంటారు. ఆ విధంగా ఆయన మరల పునర్జీవుతులు అవుతారు.
నిమి మాత్రం తనకి ఇక జీవించే కోరిక లేదు అని, కాని, మానవులకి సాయంగా ,వారి కన్నులని కాపడుతూ వుంటా అని కోరుకుంటాడు. బ్రహ్మ వరం ఇస్తాడు. అప్పటినించి మానవుల యొక్క కను బొమ్మలుగా నిమి చక్రవర్తి వుంటున్నారు. అందుకనే మనుషులను 'నిమిషులు" అంటారు. దేవతలను "అనిమిషులు" అంటారు. అన్నమాచార్యుల వారు వ్రాసిన ఒక పాట గుర్తు చేస్కుంటే,

"అనిమిషేంద్రులు" మునులు దిక్పతులమర కిన్నెర సిద్ధులు...
ఘనతతో రంభాది కాంతలు గాచినారెచ్చరికయా

అని దేవతలను , అనిమిషులుగా సంబొదించారు

ఇక కధలోకి వద్దాం. ఆ రకంగా నిమి కనుబొమ్మ గాను, వశిష్తుల వారు తిరిగి వశిష్తుల వారుగా వెళ్ళిపొయారు. అయితే యాగ శాల లో నిమి చక్రవర్తి యొక్క చితా భస్మం అలానే పడి వుంది. లోక కల్యాణం కోసం చెపట్టిన యజ్ఞం లొ ఇలా మానవ చితా భస్మం వుండకూఉడదు అని,గౌతముడు,ఇత్యాది మునులు అందరూ కలిసి, ఆ భస్మాన్ని చిలికి అందులోంచి ఒక బాలుడిని తీసుకు వచ్చారు. తల్లి ప్రమేయం లెకుండా కేవలం తండ్రి వలనే పుట్టాడు కాబట్టి వాడిని "జనకుడు" అన్నారు.

ఆ విధంగా, మిధిల నగరాధీశులందరికి ఆ నామధేయం వచ్చింది. మనకి తెలిసిన జనకుడి పేరు శీలధ్వజుడు, ఆయన తమ్ముడి పేరు కుశధ్వజుడు.

-సశేషం-

3 comments:

Kishore Relangi said...

Thanks brother.

KayKay said...

very very happy to see that you have finally started off venting your enormous bank of info ...

subramanyam K .V. said...

Nice Job Karthik ,expecting more articles from you. I 'm book marking your site.

Do visit this site in case you have time .
http://suryasatya.wordpress.com/