Wednesday, April 9, 2008

ఉగాది...నిజంగానే ఉగాదా?

ఉగాది...

ముందుగా మిత్రులందరికి సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు
ఇక విషయానికి వద్దాం..ఉగాది అంటే యేంటి? మొన్న మా మిత్రుడు అంటున్నాడు...యుగ+ఆది..యుగాది కాస్తా ఉగాది అయింది అని.,.కావచ్చు..నాకు తెలియదు..నాకు తెలిసినంత వరకు ఉగాది అంటే, ఉగాది పచ్చడి తింటమే ..హిహి


ఉగాది మనకి చాలా ముఖ్యమైన పండగ...సంవత్సరాది అని కూడా అంటాం. అందుకే,.ఆది పండుగ అనమాట..మనం, అంటే ఆంధ్రులం పాటించేది చాంద్రమాణం. చాంద్రమాణం ప్రకారంగా, ఉగాది నాటి నించి, చైత్ర మాసం ప్రారంభం అవుతుంది.....భగవన్నామం చేసుకుని , ఉగాది పచ్చడి తిని, పెద్దలకు నమస్కరించి, ఒక చిన్న సాహితీ గోష్టీ యెర్పాటు చేసుకోవటం, ఉగాది పండుగ కు మనం చేయవలసిన పని..కాని చేసామా?


జిడ్డు వదులుతుందిలే అని తలంటి పొసుకున్నాం,,,అమ్మ తిడుతుంది అని, దేవుడికి దండం పెట్టుకున్నాం..పెద్దలకి నమస్కరించటం మన రక్తం లోనే లేదు..ఇక సాహితీ గోష్టి అంటారా, సాహిత్యం అనగానేమి?
నేను కొంచం అతికి పోయి, మా ఇంటి దగ్గర ఒక పెద్దాయన ఉంటే, పట్టు బట్టి సాయంత్రం అందరం కలుద్దాం, యేవో తెలుగులొ నాలుగు మాటలు మాట్లాడుకుందాం అని ఆయన్ని వొప్పించాను...సాయంత్రం అయింది, నేను మైక్, స్పీకర్స్, అన్నీ పెట్టాను...చిన్ని చిన్ని పిల్లలు వచ్చి నా దగ్గరికి మేము డాన్స్ చేస్తాం అన్నరు..వాళ్ళని నిరుత్సాహ పరచటం ఇష్టం లేక, సరే అన్నాను..అప్పటి మొదలు రాత్రి తొమ్మిదన్నర దాకా పిల్లలందరు హిందీ పాటలకి పిచ్చి గంతులు వేసారు...


చివరికి నాకు విసుగు పుట్టి, ఒక బామ్మ గారి దగ్గరికి వెళ్ళి, పద్యాలు చదవమన్నా...ఐదు నిముషాలలొ పిల్లలు, పెద్దలు అందరూ వెళ్ళిపోయారు...అప్పుడు అనిపించింది..అసలు వీళ్ళకి ఉగాది అంటే ఏంటో తెలుసా అని...పిల్లలకి నాలుగు మంచి ముక్కలు నేర్పటానికి కూడా పెద్దలకి మనసు రావటం లేదేంటో అర్థం కావట్లేదు..ఏదో వచ్చాం, వెళ్ళాం
అని ఉండేట్టుగా ఉంటే అసలు ఎందుకు పండగలు చేసుకొవటం..ఇంట్లో అమ్మను, అమ్మ అని, నాన్నగారిని నాన్నగారని, పిలిచే రోజులు యేనాడో పొయినాయి. కనీసం పండగ పూట అన్నా నాలుగు తెలుగు మాటలు మాట్లాడతారేమో అని చూస్తే..అబ్బే, లేదుగా...వాళ్ళకి కావల్సిందల్లా ఆ కాసేపు అలా అలా కాలక్షేపం చేయటం...తెలుగు పండగ అని డాబులు కొట్టుకుని, తెలుగు పద్యం వినగానే లేచిపొయిన వాళ్ళకి అసలు ఉగాది జరుపుకునే హక్కు ఉందంటారా?

విధేయుడు
వంశీ కృష్ణ కార్తీక్
vamsi.vallurik@gmail.com