Friday, March 30, 2007

Nenu naa Jeevitam


స్త్రీ బుద్ధి ప్రళయాంతకహ అన్నారు పెద్దలు....వీడేమిటిరా ఇలా మొదలెట్టాడు అనుకుంటున్నారేమో...నేను కూడా ఇంత కాలం 'యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రవంతి దెవతా' అనుకున్న వాడినే......మరి ఇప్పుడు ఏమైంది అంటారా…ఏమో..ఎందుకో గడచిన కొన్ని రొజులుగా ఇదే అనిపిస్తోంది…అంత బాధ పడుటూ వాళ్ళ గురించి ఎందుకులేండి…మగ మహారాజులం మనం ఉన్నాం కదా…ఎమంటారు?… ;)


సరే ఇక నేను, నాలో చెప్పుకోదగ్గ గొప్ప విషయాలేమి లేవు..ఏదో సాదా సీదా మనిషిని….పేరు వంశీ కృష్ణ కార్తీక్….ఉండేది భాగ్యనగరంలో(అభాగ్యమేమో) చేసేది సాఫ్త్ వేరు ఇoజినీర్ అనే కొత్త పేరు పెట్టిన టైపిస్టు ఉద్యోగం….ఇంకా సహధర్మ చారిని రాలేదు..బహుశా అందుకేనేమో మొదట అలా రాసాను…అయ్యుంటే నన్నీపాటికి చంపేయదూ :) ..


భగవంతుడు అనే వాడున్నాడని నమ్మే వాడిని నేను..అయన నాకిచ్చిన అతి పెద్ద వరం…మా అమ్మ, నాన్నగారు…మళ్ళీ జన్మంటూ ఉంటే వీరికే పుట్టాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను.అదే విధంగా వేరే జన్మ ఉండగూడదని కూడా కోరుకుంటున్నాను…


ఏదో అంటారు..సృష్తిలో తీయనైనది స్నేహమేనోయి అని….ఏమో నాకైతే తీపి కన్నా చేదు అనుభవాలే ఎక్కువ ఉన్నాయ్….బహుసా అది నాలోనే ఏదైనా లోపం అయ్యుండచ్చు…అది తెలియాలంటే నా స్నేహితులు నాతో ఆ ముక్క చెప్పేస్తే మారటానికి నాకు ఆస్కారం ఉంటుంది. మార్పు కావాలండోయ్
ఇకపొతె నా అభిరుచులు…రుచిగా ఉండే పదార్థాలన్నీ తినటం నా అభిరుచి…నా గొంతు బండగా ఉండేది(ఇంకా ఉందండోయ్)..అందుకని చిన్నప్పుడు నాకు సంగీతం నెర్పాలంటే మా మష్తారు భయపడిపొయారు… సంగీతం ఐతే రాలేదు కానీ ఆ భగవంతుడి కృపా కటాక్ష వీక్షణం వల్ల…కీర్తనలను పాడగలుగుతున్నా(ఇప్పటికీ గాన గార్ధబాన్నే లేండి)…


ఫ్రస్తుతానికైతే వొంటరిని…ఎప్పటికైనా వొంటరినే లేండి..కాకపొతే ఎదో ఎవరో వస్తారనే చిన్న ఆశ....
ఇంత సేపు నా సొల్లు ఎవరూ చదివి ఉండరు...చదివిన వాళ్ళకి కృతఘ్నతలు....
ఇట్లు విధేయుడు

వంశీ కృష్ణ కార్తీక్

vamsi.vallurik@gmail.com


Gurur brahma Gurur Vishnuhu..

ఇది నా మొదటి బ్లాగ్...కావున ముందుగా గురువుగారికి నమస్కరిస్తూ

శ్రీ మత్వదీయ చరితామృత మన్నయార్యా
పీత్వాపినై వసుహితామ్ మనుజాభవేయు:
త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే... నమో నమస్తే


భాగవతం లో ఒక చోట శుక మహర్షి చెప్తారు..ఎంతకాలం అయితే ఒకరి గురించి జనులు తలుస్తారో అంతకాలం వారు వైకుంఠ వాసులై వుంటారు. ఎప్పుడైతే ప్రజలు వారి గురించి మర్చిపొతారో అప్పుడు వారికి పునర్జన్మ వస్తుంది అని. అయితే అన్నమాచార్యుల వారి కీర్తి ఎటువంటిదంటే కొన్ని వేల సంవత్సరాలు ఇంకా చెప్పలంటే తెలుగు బాష ఉన్నంత కాలం ఆయన కీర్తి అత్యున్నత స్థాయిలొ నిలిచి ఉంటుంది...

విధేయుడు
వంశీ కృష్ణ కార్తీక్
vamsi.vallurik@gmail.com