Monday, April 16, 2007

Pelli..avasarama.

అసలూ నెనన్నాననీ కాదు కానీండి, పెళ్ళి పెళ్ళి అని మన పెద్దవాళ్ళు వెంట పడుతూ ఉంటారు కదాఅసలు మనకి పెళ్ళి అవసరమంటారాగురువర్యులు శ్రీ అన్నమాచార్యుల వారు అన్నట్టు

వివిధ నిర్బంధముల వెడలదోయక నన్ను
భవసాగరముల దడబడ చేతువ….

అసలే పాపులందానికితోడు ఇంకొ పాపి తొ కలిసి కొత్త పాపాలు చేసేందుకు సంసారం అనే ఇంకో నరకం లోకి వెల్లిపొతున్నాo….

మరి ఇవన్నీ అనవసరం లేదు అనే అనుకుందాం..

ఆత్మావై పుత్ర నామాసి….అని కూడా మన పెద్దలే అన్నారుఅంటే పిండం పెట్టడానికి ఒక కొడుకు ఉండాలంటారుపెళ్ళి కాకుండా పిల్లలు ఎక్కడి నించి వస్తారు(ఇంక చాలు ఆలొచనలు ఆపండి)

పొనీ పెళ్ళి వద్దు అనుకుందామా….అగస్త్యుడంతటి వారే..వారి పితృదేవతలకి ఉత్తమగతులు కలగాలని పెళ్ళి చేసుకుని..పుత్రుని కన్నారు కదా..మనమెంత

అలా అని..బ్రహ్మచారులుగా ఉండి బోలెడంట జ్ఞానాన్ని సంపాదించిన, తాతగారు నారదుల వారు లేరావారితో మనకి పొలికేమిటి లేండి.. అంత మాత్రానికి పెళ్ళి చెసుకోవాలని లేదుఅసలు పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఎవరో ఒకరు మనల్ని ఏదో ఒక రకంగా శాశిస్తూనే ఉంటారు..ఏదో ఒక ఉద్యోగం వచ్చాక..మన కార్యాలయాల్లో ఎలా ఉన్నా..ఇంట్లో కాస్త పరిస్తితి మెరుగు పడుతుందిమళ్ళీ వెంటనే పెళ్ళి అంటారు
జీవితం మొత్తం శాసించే ఒక వ్యక్తిని పని గట్టుకుని ఆహ్వానించాలా?

ఏ కాటికి..అమ్మాయి అత్తగారింటికి వస్తుంది..పాపం ఎలా ఉంటుందో ఎమిటో..అబ్బాయి సరిగ్గా చుసుకుంటాడో లేదో అనే కాని..అబ్బాయి మంచి వాడే..ఈ అమ్మాయి అతన్ని అర్థం చేసుకుంటుందో లేదో..అత్తగారిని బాగా చూసుకుంటుందో లేదో అని ఒక్కరూ ఆలోచించరు….పైగా అత్తగారేదో కొడలి మీద పెత్తనం చెలాయిస్తొందంటూ పుకార్లు పుట్టిస్తారు

నాకు ఇంకా పెళ్ళి కాలేదు..నాకేమిటి మా అన్నయ్యకే కాలేదు..ఏదో ఊసుపొక ఇలా ఉన్న అక్కసంతా కక్కేసా…...ఉంటా

ఇంతకీ నేను చెప్పదలచుకుంది యేమిటి అంటే---- వివాహం విద్య నాశాయఆ తర్వాత నేను చెప్పను.. విధేయుడు
వంశీ కృష్ణ కార్తీక్


6 comments:

Hemanth Pradeep said...

Vivaham Vidya nasayam ani chakkaga chepparu anduke purvakalam lo maharaju gari pillalni aasramallo vunchi ,oriki duram ga vunchi chadivinchevaru

oollo vunte amayilaki line vesi padipotaranemo

Anyways ..me alochanalani rupam istu rastunan blogs ku adarana epudu vuntundi ..carryon Kathik

వెంకట రమణ said...

మీ బ్లాగు చాలా బాగుంది.


తెలుగులో ఇంకా చాలా మంది బ్లాగులు వ్రాస్తున్నారు వివరాలకు ఈలింకులు చూడండి,
http://groups.google.com/group/telugublog
http://koodali.org

కొత్త పాళీ said...

బాగుంది. మీ తరువాయి వడ్డ్నలకోసం ఎదురుచూస్తుంటాం.

రాధిక said...

ఆడవాళ్ళదీ సేం ఫీలింగ్.మీకో విషయం తెలీదేమో..అమ్మాయి కి పెళ్ళి వయసు రాక ముందు నుండీ ఏమి తప్పు చేసినా[అలిగినా,కోపం గా మాట్లాడినా] రేపు అత్తోరింటిలో ఏమి చేస్తావ్,మొగుడి తోనూ ఇలానే మాట్లాడతావా అంటూ నస మొదలెడతారు.పెళ్ళి కుదిరినప్పటి నుండి అత్తమామలను బాగా చూసుకోవాలి,వాల్ల దగ్గర తగ్గి మాట్లాడాలి,భర్త కు వీలు గా నడుచుకోవాలి...ఇలా పురాణం లా చెపుతూనే వుంటారు. కొద్దిగా రెండు వైపులా ఆలోచించి రాసుండాల్సింది.ఇంతకీ మీ ఇంట్లో ఆడపిల్లలున్నారా?

Gowri Shankar Sambatur said...

మీ బ్లాగును తేనెగూడు లో చేర్చాను. తేనెగూడు ఏమిటి అనుకుంటున్నరా - ఇక్కడ చూడంది.
www.thenegoodu.com

ఇట్లు
గౌరి శంకర్

విహారి(KBL) said...

మీ బ్లాగు బాగుంది.ఈ మధ్య రాయటంలేనటున్నరు.అలగే బ్లాగు పేరు తెలుగులో పెట్టండి.ఇంకా బాగుంటుంది.