Wednesday, October 31, 2007

aandhra raashtra avatarana - ఆంధ్ర రాష్త్ర అవతరణ

ఇవాళ పొద్దున్న తేజా టివీ లో ఒక చిత్రం వచ్చింది,. మాఉళ్ళొ మహా శివుడు ఆ చిత్రం పేరు..మంచి సరదా చిత్రమని చూడటం మొదలు పెట్టా..ఐతేఒక చోట, శివుడి పాత్ర పోషిస్తున్న రావు గోపాళరావుకి, పూజారి పాత్ర పోషిస్తున్న సత్యన్నరాయణ కి మధ్య జరిగిన సంభాషణ నన్ను ఆకట్టుకుంది,ఒక, మసాలా వడ చెయ్యాలి అంటే, గుజరాత్ రాష్త్రం లో పండే నూనె, ఉత్తర ప్రదేష్ లో పండే మినప్పప్పు, ఆంధ్ర రాష్త్రంలోని మిరప కాయ, ఇలా మొత్తం ఎనిమిది(8) రాష్త్రాల నించి తెచ్చిన వస్తువులు కలిపితే కాని, ఒక చిన్న మసాల వడ అవదు...అంటే? ఒక చిన్న మసాలా వడ కోసం, మనం దేశమంతా తిరగాలి అన్నమాట....ఈ మాట చెప్పి, విభజన వల్ల ఉండే కష్టమేంటొ చెప్పారు...
ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి, భారతావనికి స్వాతంత్రాన్ని ఇచ్చిన మహనీయులు, ఇవాళ ఉండుంటే, తుచ్చమైన పదవుల కోసం, రాష్త్రాలు కావాలి, అని ఇవాల్టి రోజున కొంతమంది కపట నేతల దౌర్భాగ్యపు స్థితి ని చూసి బాధ పడేవాళ్ళు..ఎందుకంత స్వార్థం? భారతావని మన అందరిది, భారత దేశం లో నేను ఎక్కడికైనా వెళ్ళగలను అన్న నమ్మకం మనలొ కలగాలి కాని,నీది ఆంధ్ర, నాది తెలంగాణా, నీవు నేనున్న చోటికి రావద్దు అనటానికి ఎవరికి ఏమి అధికారాలు ఉన్నాయి?రాష్త్రం మొత్తం మీద వసూలైన డబ్బుల్లలొ, 48.96% తెలంగాణ లొ ఉన్న భాగ్యనగరానికి వెచ్చిస్తుంటే, అప్పుడు ఈ నాయకులు కిమ్మనలేదే? మరి అప్పుడు,ఆంధ్ర , సీమ ప్రాంతాలకు సమానమైన నిష్పత్తిలొ లాభాలు పంచలేదుగా?
ఎవరో వస్తారు, రాష్ట్రం వస్తుంది,అని ఎదురు చూడటం కన్నా, మన ఎదుగుదలకు, మనమే బాట వేసుకుంటే, సమాజం దాని అంతట అదే ఎదుగుతుంది..
ఆంధ్ర రాష్త్ర అవతరణ దినోత్సవాన్ని, బ్లాక్ డే గా అనటం, నిజంగా కన్న తల్లిని అవమానించటమే, అది గుర్తెరిగితే మంచిది...

ఈ నవంబర్ ఒకటో తారీఖున, మన ఆంధ్ర రాష్త్ర అవతరణ దినోత్సవ సందర్భంగా....ఈ బ్లాగ్ రాశాను, ఎవరి మనసుల నైనా నొప్పిస్తే , క్షమించగలరు, కాని మనసు పెట్టి ఆలొచించమని ప్రార్థన...జై తెలుగు తల్లి, జై ఆంధ్ర ప్రదేష్


మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు, కనుచూపులో కరుణ చిరునవ్వులో
సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు ...

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు ...

అమరావతీనగరి అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ పాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగుతల్లీ, జై తెలుగు తల్లీ!


భవదీయుడు
వంశీ కృష్ణ కార్తీక్

Tuesday, October 30, 2007

jeevitapu samatulyata...జీవితపు సమతుల్యత

ఇప్పటికి చాలా రోజుల క్రితం రాశాను..మళ్ళీ ఇదిగో ఇప్పుడు రాస్తున్నాను....అప్పటికి , ఇప్పటికి ఒక్కటే తేడా, పని చేస్తున్న సంస్థ మారాను..ఇప్పుడు నేను ఓరాకల్ అనే సంస్ఠలొ పని చేస్తున్నాను..ఇక్కడికి వచ్చిన తరవాత కాని తెలియలేదు, యే రాయి ఐనా ఒకటే పళ్ళు ఊడగొట్టుకోటానికి అని..
జీవితం సాఫీగానే సాగిపొతోంది..చేతనైనంత వరకు పక్క వాళ్ళకి సాయం చేయటానికి ప్రయత్నిస్తున్నా...ఇదేంటీ, సొంత డబ్బా అంటారా..సరే..ఇంకో విషయానికి వద్దాం..


నేను నాతొ పనిచేసే వాళ్ళలో కొంత మందిని చుస్తున్నా, వాళ్ళు, పొద్దున్నే కార్యాలయానికి వస్తారు, రాత్రి పది, పదకొండు అయినా ఇళ్ళకు వెళ్ళరు...ఎందుకంటే, వాళ్ళు త్వరగా సంస్థలో ఎదగాలి అని చూస్తున్నారు..
వాళ్ళను చూసి ముందు భయం వేసింది, తర్వాత బాధ వేసింది...భయం ఎందుకు వేసింది అంటే, అమ్మో, వీళ్ళ మధ్యలో మనం పని చెయగలమా..వీళ్ళు ఇంత కష్టపడుతూ ఉంటే, మనం వీళ్ళతో పోలిస్తే ఎంతా అని.....బాధ ఎందుకు వేసింది అంటే, ఆలొచించగా, నాకు ఇలా అనిపించింది,...

విపరీతంగా కష్టపడి, మనం ఎదిగామే అనుకోండీ, దాని వల్ల మనం పొందింది ఎంటి? సంస్ఠలొ ఎదుగుదల,మరి కొల్పొయింది యేమిటి? మన జీవితంలోని కొన్ని అత్యుత్తమ క్షణాలు...
ఎందుకలా అంటే, ఒక్క సారి ఆలొచిద్దాం..ఇంటి దగ్గర, మనకోసం, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, మనతో మాట్లాడదాము అనుకుంటుంది, మనమేమో అర్థరాత్రి వెళ్తాము..అప్పటికి అమ్మ నిద్ర పోతుంది...

తెల్లవారేక హడావిడి..అమ్మా తొందరగా వెళ్ళాలి, మా మేనేజెర్ తో మాట్లాడాలి, అంటూ మన అరుపులు.....అరెయ్ వంశీ నీతొ కొంచం మాట్లాడాలిరా అని అమ్మ అంటుంది.,..మనమేమో రాత్రికి కి వచ్చి మాట్లాడదాము అని వెళ్ళిపోతాము..

మళ్ళీ యధా ప్రకారం రాత్రి ఆలశ్యం..ఇలా కొన్ని రోజులు పోయాక, మనకి, మన ఇంట్ళో వాళ్ళకీ, మాటలు కూడా కరువు అవుతాయి....రెండు సంవత్సరాలు గడుస్తాయి, మనకి సంస్ఠలో ఎదుగుదల వస్తుంది, కాని అప్పటికి, మనం ఆ ఆనందాన్ని పంచుకుందామంటే మనం ఆశించిన రీతిలొ ఇంట్లో వాళ్ళు స్పందించక పోవచ్చు..లేదా అసలు వాళ్ళు లేకపోనూవచ్చు. అప్పుడు మనం ఎంత బాధపడినా ఉపయోగం లేదు..

కావాలంటే మళ్ళీ ప్రొమొషన్ తెచ్చుకోవచ్చు, పోయిన క్షణాలని, అనుభూతులని తెచ్చుకోగలమా?
...మరి ఈ రెండు సంవత్సరాలు వాళ్ళతో మనం గడిపితే, రెండు సంవత్సరాలకి రావల్సిన ప్రొమొషొన్, మూడు సంవత్సరాలకి వస్తుంది..దాని వల్ల, మనకి ఎమన్నా నష్టమా? లేదే? మరి ఎందుకు ఇలా మన జీవితాలను ఆఫిసులకి అంకితం చేసుకుని, మన జీవితాలను మనం మర్చిపొతున్నాం?మనం లేకపోతే పని జరగదూ అనేది వొట్టి మాట,,,

మనం లేనప్పుడూ ఈ సంస్థలు ఉన్నాయి, మనం వెళ్ళిన తర్వాత ఈ సంస్థలు ఉంటాయి...మనం కేవలం సాగే నీరు లాటి వాళ్ళం...మన జీవితమే మనకు ప్రధానం.
పని బాగా చెయ్యాలి, ఎకాగ్రతతో , నమ్మకంగా పని చెయ్యాలి..కాని, మనకోసం ఆలొచిస్తూ ఇంట్ళొ ఒకళ్ళు ఉన్నారని, వాళ్ళని సుఖబెట్టడం మన ధర్మమని కూడా మనం గుర్తెరిగి ఉండాలి...

ఇట్లు,

భవదీయుడు,

వంశీ కృష్ణ కార్తీక్

Monday, April 16, 2007

Pelli..avasarama.

అసలూ నెనన్నాననీ కాదు కానీండి, పెళ్ళి పెళ్ళి అని మన పెద్దవాళ్ళు వెంట పడుతూ ఉంటారు కదాఅసలు మనకి పెళ్ళి అవసరమంటారాగురువర్యులు శ్రీ అన్నమాచార్యుల వారు అన్నట్టు

వివిధ నిర్బంధముల వెడలదోయక నన్ను
భవసాగరముల దడబడ చేతువ….

అసలే పాపులందానికితోడు ఇంకొ పాపి తొ కలిసి కొత్త పాపాలు చేసేందుకు సంసారం అనే ఇంకో నరకం లోకి వెల్లిపొతున్నాo….

మరి ఇవన్నీ అనవసరం లేదు అనే అనుకుందాం..

ఆత్మావై పుత్ర నామాసి….అని కూడా మన పెద్దలే అన్నారుఅంటే పిండం పెట్టడానికి ఒక కొడుకు ఉండాలంటారుపెళ్ళి కాకుండా పిల్లలు ఎక్కడి నించి వస్తారు(ఇంక చాలు ఆలొచనలు ఆపండి)

పొనీ పెళ్ళి వద్దు అనుకుందామా….అగస్త్యుడంతటి వారే..వారి పితృదేవతలకి ఉత్తమగతులు కలగాలని పెళ్ళి చేసుకుని..పుత్రుని కన్నారు కదా..మనమెంత

అలా అని..బ్రహ్మచారులుగా ఉండి బోలెడంట జ్ఞానాన్ని సంపాదించిన, తాతగారు నారదుల వారు లేరావారితో మనకి పొలికేమిటి లేండి.. అంత మాత్రానికి పెళ్ళి చెసుకోవాలని లేదుఅసలు పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఎవరో ఒకరు మనల్ని ఏదో ఒక రకంగా శాశిస్తూనే ఉంటారు..ఏదో ఒక ఉద్యోగం వచ్చాక..మన కార్యాలయాల్లో ఎలా ఉన్నా..ఇంట్లో కాస్త పరిస్తితి మెరుగు పడుతుందిమళ్ళీ వెంటనే పెళ్ళి అంటారు
జీవితం మొత్తం శాసించే ఒక వ్యక్తిని పని గట్టుకుని ఆహ్వానించాలా?

ఏ కాటికి..అమ్మాయి అత్తగారింటికి వస్తుంది..పాపం ఎలా ఉంటుందో ఎమిటో..అబ్బాయి సరిగ్గా చుసుకుంటాడో లేదో అనే కాని..అబ్బాయి మంచి వాడే..ఈ అమ్మాయి అతన్ని అర్థం చేసుకుంటుందో లేదో..అత్తగారిని బాగా చూసుకుంటుందో లేదో అని ఒక్కరూ ఆలోచించరు….పైగా అత్తగారేదో కొడలి మీద పెత్తనం చెలాయిస్తొందంటూ పుకార్లు పుట్టిస్తారు

నాకు ఇంకా పెళ్ళి కాలేదు..నాకేమిటి మా అన్నయ్యకే కాలేదు..ఏదో ఊసుపొక ఇలా ఉన్న అక్కసంతా కక్కేసా…...ఉంటా

ఇంతకీ నేను చెప్పదలచుకుంది యేమిటి అంటే---- వివాహం విద్య నాశాయఆ తర్వాత నేను చెప్పను.. విధేయుడు
వంశీ కృష్ణ కార్తీక్


Monday, April 9, 2007

ఆలోచనలు

నేను చాలా రోజులు నుంచి ఆలోచిస్తున్నా…ఏమి ఆలోచించాలా అని ఆలోచిస్తున్నా..

ఆలోచనల మూలం ఎమిటా అని ఆలోచిస్తున్నా…అసలు ఆలోచనలు ఎందుకు వస్తాయి అని ఆలోచిస్తున్నా..ఇంతకీ మూలం దొరికిందా అంటే….దొరికిందనే చెప్పాలి….

సృష్తి స్థితి లయ కారకుడైన ఆ శ్రీ మహావిష్ణువే ఈ ఆలోచనలకన్నిటికి మూలము
అందుకే అన్నమాచార్యుల వారు అంటారు…

చిత్తములొ భావమెల్ల శ్రీ వేంకటేశుడే
హత్తిన ప్రకృతి యల్ల ఆతని మాయే
మత్తిలి ఈతని కంటే మరి లేవు ఇతరములు
ఇత్తి దేహపు బ్రతుకు బ్రతికేటి వారికి ...

ఎంత చక్కగా చెప్పారండి....మన ఆలోచనల భావం ఆ శ్రీ వెంకటేశుడేనట....ఇక మిగిలిన ఈ భూప్రపంచం లోని ప్రాణులంతా ఆతను కల్పించిన మాయే....

ఈ ఒక్క ఫాట చాలాదా...ఇంకో కీర్తనలో,

భావములోన బాహ్యము నందున..
గోవింద గోవింద అని కొలువవో మనసా....

మనం మన భావములోను..అంటే ధ్యాన ప్రపంచం లోనూ అలానే ఈ బాహ్య ప్రపంచం లోనూ…ఆ గోవింద నామమే జపిస్తూ ఉండాలి…. అలా జపించినప్పుడే మనకి, పైన చెప్పినట్టుగా...ఆ ఆలొచనల భావం ఆ శ్రీవేంకటేశుడే అని అర్థం అవుతుంది,,,
ఉపన్యాసం ఇచ్చేస్తున్నానా?...ఏదో అన్నమాచార్య కీర్తనల మీద మక్కువ తొ ఇలా ఉదహరణ సహితంగా రాద్దామని అనిపించింది(ఇక్కడేమి ఉదహరణ ఇవ్వలేదు..వెతకకండీ)...

ఇట్లు భవదీయుడు
వంశీ కృష్ణ కార్తీక్

Friday, March 30, 2007

Nenu naa Jeevitam


స్త్రీ బుద్ధి ప్రళయాంతకహ అన్నారు పెద్దలు....వీడేమిటిరా ఇలా మొదలెట్టాడు అనుకుంటున్నారేమో...నేను కూడా ఇంత కాలం 'యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రవంతి దెవతా' అనుకున్న వాడినే......మరి ఇప్పుడు ఏమైంది అంటారా…ఏమో..ఎందుకో గడచిన కొన్ని రొజులుగా ఇదే అనిపిస్తోంది…అంత బాధ పడుటూ వాళ్ళ గురించి ఎందుకులేండి…మగ మహారాజులం మనం ఉన్నాం కదా…ఎమంటారు?… ;)


సరే ఇక నేను, నాలో చెప్పుకోదగ్గ గొప్ప విషయాలేమి లేవు..ఏదో సాదా సీదా మనిషిని….పేరు వంశీ కృష్ణ కార్తీక్….ఉండేది భాగ్యనగరంలో(అభాగ్యమేమో) చేసేది సాఫ్త్ వేరు ఇoజినీర్ అనే కొత్త పేరు పెట్టిన టైపిస్టు ఉద్యోగం….ఇంకా సహధర్మ చారిని రాలేదు..బహుశా అందుకేనేమో మొదట అలా రాసాను…అయ్యుంటే నన్నీపాటికి చంపేయదూ :) ..


భగవంతుడు అనే వాడున్నాడని నమ్మే వాడిని నేను..అయన నాకిచ్చిన అతి పెద్ద వరం…మా అమ్మ, నాన్నగారు…మళ్ళీ జన్మంటూ ఉంటే వీరికే పుట్టాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను.అదే విధంగా వేరే జన్మ ఉండగూడదని కూడా కోరుకుంటున్నాను…


ఏదో అంటారు..సృష్తిలో తీయనైనది స్నేహమేనోయి అని….ఏమో నాకైతే తీపి కన్నా చేదు అనుభవాలే ఎక్కువ ఉన్నాయ్….బహుసా అది నాలోనే ఏదైనా లోపం అయ్యుండచ్చు…అది తెలియాలంటే నా స్నేహితులు నాతో ఆ ముక్క చెప్పేస్తే మారటానికి నాకు ఆస్కారం ఉంటుంది. మార్పు కావాలండోయ్
ఇకపొతె నా అభిరుచులు…రుచిగా ఉండే పదార్థాలన్నీ తినటం నా అభిరుచి…నా గొంతు బండగా ఉండేది(ఇంకా ఉందండోయ్)..అందుకని చిన్నప్పుడు నాకు సంగీతం నెర్పాలంటే మా మష్తారు భయపడిపొయారు… సంగీతం ఐతే రాలేదు కానీ ఆ భగవంతుడి కృపా కటాక్ష వీక్షణం వల్ల…కీర్తనలను పాడగలుగుతున్నా(ఇప్పటికీ గాన గార్ధబాన్నే లేండి)…


ఫ్రస్తుతానికైతే వొంటరిని…ఎప్పటికైనా వొంటరినే లేండి..కాకపొతే ఎదో ఎవరో వస్తారనే చిన్న ఆశ....
ఇంత సేపు నా సొల్లు ఎవరూ చదివి ఉండరు...చదివిన వాళ్ళకి కృతఘ్నతలు....
ఇట్లు విధేయుడు

వంశీ కృష్ణ కార్తీక్

vamsi.vallurik@gmail.com


Gurur brahma Gurur Vishnuhu..

ఇది నా మొదటి బ్లాగ్...కావున ముందుగా గురువుగారికి నమస్కరిస్తూ

శ్రీ మత్వదీయ చరితామృత మన్నయార్యా
పీత్వాపినై వసుహితామ్ మనుజాభవేయు:
త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే... నమో నమస్తే


భాగవతం లో ఒక చోట శుక మహర్షి చెప్తారు..ఎంతకాలం అయితే ఒకరి గురించి జనులు తలుస్తారో అంతకాలం వారు వైకుంఠ వాసులై వుంటారు. ఎప్పుడైతే ప్రజలు వారి గురించి మర్చిపొతారో అప్పుడు వారికి పునర్జన్మ వస్తుంది అని. అయితే అన్నమాచార్యుల వారి కీర్తి ఎటువంటిదంటే కొన్ని వేల సంవత్సరాలు ఇంకా చెప్పలంటే తెలుగు బాష ఉన్నంత కాలం ఆయన కీర్తి అత్యున్నత స్థాయిలొ నిలిచి ఉంటుంది...

విధేయుడు
వంశీ కృష్ణ కార్తీక్
vamsi.vallurik@gmail.com