ఇవాళ పొద్దున్న తేజా టివీ లో ఒక చిత్రం వచ్చింది,. మాఉళ్ళొ మహా శివుడు ఆ చిత్రం పేరు..మంచి సరదా చిత్రమని చూడటం మొదలు పెట్టా..ఐతేఒక చోట, శివుడి పాత్ర పోషిస్తున్న రావు గోపాళరావుకి, పూజారి పాత్ర పోషిస్తున్న సత్యన్నరాయణ కి మధ్య జరిగిన సంభాషణ నన్ను ఆకట్టుకుంది,ఒక, మసాలా వడ చెయ్యాలి అంటే, గుజరాత్ రాష్త్రం లో పండే నూనె, ఉత్తర ప్రదేష్ లో పండే మినప్పప్పు, ఆంధ్ర రాష్త్రంలోని మిరప కాయ, ఇలా మొత్తం ఎనిమిది(8) రాష్త్రాల నించి తెచ్చిన వస్తువులు కలిపితే కాని, ఒక చిన్న మసాల వడ అవదు...అంటే? ఒక చిన్న మసాలా వడ కోసం, మనం దేశమంతా తిరగాలి అన్నమాట....ఈ మాట చెప్పి, విభజన వల్ల ఉండే కష్టమేంటొ చెప్పారు...
ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి, భారతావనికి స్వాతంత్రాన్ని ఇచ్చిన మహనీయులు, ఇవాళ ఉండుంటే, తుచ్చమైన పదవుల కోసం, రాష్త్రాలు కావాలి, అని ఇవాల్టి రోజున కొంతమంది కపట నేతల దౌర్భాగ్యపు స్థితి ని చూసి బాధ పడేవాళ్ళు..ఎందుకంత స్వార్థం? భారతావని మన అందరిది, భారత దేశం లో నేను ఎక్కడికైనా వెళ్ళగలను అన్న నమ్మకం మనలొ కలగాలి కాని,నీది ఆంధ్ర, నాది తెలంగాణా, నీవు నేనున్న చోటికి రావద్దు అనటానికి ఎవరికి ఏమి అధికారాలు ఉన్నాయి?రాష్త్రం మొత్తం మీద వసూలైన డబ్బుల్లలొ, 48.96% తెలంగాణ లొ ఉన్న భాగ్యనగరానికి వెచ్చిస్తుంటే, అప్పుడు ఈ నాయకులు కిమ్మనలేదే? మరి అప్పుడు,ఆంధ్ర , సీమ ప్రాంతాలకు సమానమైన నిష్పత్తిలొ లాభాలు పంచలేదుగా?
ఎవరో వస్తారు, రాష్ట్రం వస్తుంది,అని ఎదురు చూడటం కన్నా, మన ఎదుగుదలకు, మనమే బాట వేసుకుంటే, సమాజం దాని అంతట అదే ఎదుగుతుంది..
ఆంధ్ర రాష్త్ర అవతరణ దినోత్సవాన్ని, బ్లాక్ డే గా అనటం, నిజంగా కన్న తల్లిని అవమానించటమే, అది గుర్తెరిగితే మంచిది...
ఈ నవంబర్ ఒకటో తారీఖున, మన ఆంధ్ర రాష్త్ర అవతరణ దినోత్సవ సందర్భంగా....ఈ బ్లాగ్ రాశాను, ఎవరి మనసుల నైనా నొప్పిస్తే , క్షమించగలరు, కాని మనసు పెట్టి ఆలొచించమని ప్రార్థన...జై తెలుగు తల్లి, జై ఆంధ్ర ప్రదేష్
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు, కనుచూపులో కరుణ చిరునవ్వులో
సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు ...
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు ...
అమరావతీనగరి అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ పాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగుతల్లీ, జై తెలుగు తల్లీ!
భవదీయుడు
వంశీ కృష్ణ కార్తీక్
Wednesday, October 31, 2007
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
నేను కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకినే. ఒక దేశం లో ప్రజలే కలిసి వుండలేకపోతే ఇక ప్రపంచ దేశాలతో పొత్తు మాటేమిటి. మనిషి కీ మనిషి కీ మధ్య కులం, మతం, జాతి, అంతస్తు.. చెప్తూ పోతే అనేకం.
Post a Comment