Monday, April 16, 2007

Pelli..avasarama.

అసలూ నెనన్నాననీ కాదు కానీండి, పెళ్ళి పెళ్ళి అని మన పెద్దవాళ్ళు వెంట పడుతూ ఉంటారు కదాఅసలు మనకి పెళ్ళి అవసరమంటారాగురువర్యులు శ్రీ అన్నమాచార్యుల వారు అన్నట్టు

వివిధ నిర్బంధముల వెడలదోయక నన్ను
భవసాగరముల దడబడ చేతువ….

అసలే పాపులందానికితోడు ఇంకొ పాపి తొ కలిసి కొత్త పాపాలు చేసేందుకు సంసారం అనే ఇంకో నరకం లోకి వెల్లిపొతున్నాo….

మరి ఇవన్నీ అనవసరం లేదు అనే అనుకుందాం..

ఆత్మావై పుత్ర నామాసి….అని కూడా మన పెద్దలే అన్నారుఅంటే పిండం పెట్టడానికి ఒక కొడుకు ఉండాలంటారుపెళ్ళి కాకుండా పిల్లలు ఎక్కడి నించి వస్తారు(ఇంక చాలు ఆలొచనలు ఆపండి)

పొనీ పెళ్ళి వద్దు అనుకుందామా….అగస్త్యుడంతటి వారే..వారి పితృదేవతలకి ఉత్తమగతులు కలగాలని పెళ్ళి చేసుకుని..పుత్రుని కన్నారు కదా..మనమెంత

అలా అని..బ్రహ్మచారులుగా ఉండి బోలెడంట జ్ఞానాన్ని సంపాదించిన, తాతగారు నారదుల వారు లేరావారితో మనకి పొలికేమిటి లేండి.. అంత మాత్రానికి పెళ్ళి చెసుకోవాలని లేదుఅసలు పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఎవరో ఒకరు మనల్ని ఏదో ఒక రకంగా శాశిస్తూనే ఉంటారు..ఏదో ఒక ఉద్యోగం వచ్చాక..మన కార్యాలయాల్లో ఎలా ఉన్నా..ఇంట్లో కాస్త పరిస్తితి మెరుగు పడుతుందిమళ్ళీ వెంటనే పెళ్ళి అంటారు
జీవితం మొత్తం శాసించే ఒక వ్యక్తిని పని గట్టుకుని ఆహ్వానించాలా?

ఏ కాటికి..అమ్మాయి అత్తగారింటికి వస్తుంది..పాపం ఎలా ఉంటుందో ఎమిటో..అబ్బాయి సరిగ్గా చుసుకుంటాడో లేదో అనే కాని..అబ్బాయి మంచి వాడే..ఈ అమ్మాయి అతన్ని అర్థం చేసుకుంటుందో లేదో..అత్తగారిని బాగా చూసుకుంటుందో లేదో అని ఒక్కరూ ఆలోచించరు….పైగా అత్తగారేదో కొడలి మీద పెత్తనం చెలాయిస్తొందంటూ పుకార్లు పుట్టిస్తారు

నాకు ఇంకా పెళ్ళి కాలేదు..నాకేమిటి మా అన్నయ్యకే కాలేదు..ఏదో ఊసుపొక ఇలా ఉన్న అక్కసంతా కక్కేసా…...ఉంటా

ఇంతకీ నేను చెప్పదలచుకుంది యేమిటి అంటే---- వివాహం విద్య నాశాయఆ తర్వాత నేను చెప్పను.. విధేయుడు
వంశీ కృష్ణ కార్తీక్


Monday, April 9, 2007

ఆలోచనలు

నేను చాలా రోజులు నుంచి ఆలోచిస్తున్నా…ఏమి ఆలోచించాలా అని ఆలోచిస్తున్నా..

ఆలోచనల మూలం ఎమిటా అని ఆలోచిస్తున్నా…అసలు ఆలోచనలు ఎందుకు వస్తాయి అని ఆలోచిస్తున్నా..ఇంతకీ మూలం దొరికిందా అంటే….దొరికిందనే చెప్పాలి….

సృష్తి స్థితి లయ కారకుడైన ఆ శ్రీ మహావిష్ణువే ఈ ఆలోచనలకన్నిటికి మూలము
అందుకే అన్నమాచార్యుల వారు అంటారు…

చిత్తములొ భావమెల్ల శ్రీ వేంకటేశుడే
హత్తిన ప్రకృతి యల్ల ఆతని మాయే
మత్తిలి ఈతని కంటే మరి లేవు ఇతరములు
ఇత్తి దేహపు బ్రతుకు బ్రతికేటి వారికి ...

ఎంత చక్కగా చెప్పారండి....మన ఆలోచనల భావం ఆ శ్రీ వెంకటేశుడేనట....ఇక మిగిలిన ఈ భూప్రపంచం లోని ప్రాణులంతా ఆతను కల్పించిన మాయే....

ఈ ఒక్క ఫాట చాలాదా...ఇంకో కీర్తనలో,

భావములోన బాహ్యము నందున..
గోవింద గోవింద అని కొలువవో మనసా....

మనం మన భావములోను..అంటే ధ్యాన ప్రపంచం లోనూ అలానే ఈ బాహ్య ప్రపంచం లోనూ…ఆ గోవింద నామమే జపిస్తూ ఉండాలి…. అలా జపించినప్పుడే మనకి, పైన చెప్పినట్టుగా...ఆ ఆలొచనల భావం ఆ శ్రీవేంకటేశుడే అని అర్థం అవుతుంది,,,
ఉపన్యాసం ఇచ్చేస్తున్నానా?...ఏదో అన్నమాచార్య కీర్తనల మీద మక్కువ తొ ఇలా ఉదహరణ సహితంగా రాద్దామని అనిపించింది(ఇక్కడేమి ఉదహరణ ఇవ్వలేదు..వెతకకండీ)...

ఇట్లు భవదీయుడు
వంశీ కృష్ణ కార్తీక్