21వ శతాబ్డం లో కాంతి వేగం తో దూసుకు వెళ్ళిపోతున్న ఈ ప్రపంచం లో, ఇంకా పాత రాతి యుగపు మాటలు ఎంటీ అని చాలామంది అంటూ ఉంటారు. ఒక్కసారి ఆ విషయాలను విశ్లేషిద్దాం. ప్రగతి అన్న మాటకి అర్ధం యేమిటి? మానశికంగా, సాంస్క్రుతికంగా, స్థితిపరంగా, వైజ్ఞానిక పరంగా ఉన్నత స్థాయి ని చేరుకోవటమే ప్రగతి.
మరి ఇవాల ఉన్నదేమిటీ? మొన్న నేను ఒక బట్టల దుకాణంకి వెళ్ళాను, అది ఈ భాగ్య నగరం లో చాలా పేరు ఉన్న కొట్టు, సెంట్రల్ అని ఉంది లేండి. సరే తీరా వెళ్ళానా, నేను వెల్తే వాడు సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడట్లేదు..నేను యెమైనా గతి లేక వచ్చా అనుకున్నడేమో అనిపించింది....ఇంతలో ఒకడు వచ్చాడు, పిల్లి గడ్డం , చెవికి ఒక ఫోగు, మోకాళ్ళ దగ్గర చిరిగిన పాంటు. వాడిని చూస్తేనే నాకు జలదరించింది.....ఇక ఈ షాపు వాడి హడావిడి చూడాలి, వాడిని పట్టుకుని వదలలేదు, యెంతో గౌరవం గా , వాడు అడిగిన వన్ని చూపించాడు. తెలిసిన వాడేమో అనుకున్నా, కానీ కాదట. అప్పుడు అనుకున్నా, వంటి నిండా బట్టలు కట్టుకోవటం కుడా తప్పేనా అని. ఈ ఉదాహరణ ఎందుకు ఇచ్చాను అంటే, ఇవాల మన సమాజం లో, మన సంస్కృతి సంప్రదాయాలని పాటించే వారికి విలువ లేకుండా పొయింది.
నేను పని చేసేది ఒక పెద్ద కంపెనీలోనే, అక్కడ మనుషులు యెలా మాట్లాడతారంటే, వాళ్ళేదో పుట్టుక నించి ఆ విదేశీ పద్దతుల్లో పెరిగినట్టు, కనీసం మన బాష మీద గౌరవం కూడా లేనట్టు మాట్లాడతారు. ఫక్క జాతి మీద గౌరవం , ప్రేమ ఉండటం లో తప్పు లేదు, మన సంస్కృతి మీద అంత నిర్లక్షం పనికిరాదు.
మేము ఒక గుడి కట్టాము. నేను చందాలు అడిగితే, చాలమంది ఒక మాట అన్నారు. ఈ రోజుల్లో కూడా గుడీ, గోపురము యెంటీ అని..అసలు ఆ ప్రశ్న యేమిటో నాకు అర్థం కాలేదు. కాలం మారింది కదా అని అన్నం తినటం మానేశామా? తప్పించుకోటానికే అయి ఉండచ్చు, కాని ఈ రకమైన మాటలు సర్వ సాధరణమైపొయాయి.
తెలుగులో మట్లాడితే అదో నేరం. తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందని, ఈ ఆంగ్ల బాష పిచ్చి వల్ల, మామూలు వాళ్ళు కూడా, అటు ఆంగ్ల బాషకి , ఇటు మాతృబాషకి దూరం అవుతున్నారు. ఈ టి.వి లో వచ్చే ఆడవాళ్ళ తెలుగు ఐతే భరించలేము. అసలు వాళ్ళు తెలుగుని ఇంత దారుణంగా విరిచేసి యెందుకు మాట్లాడతారో అర్థం కాదు. కాని విశేషం యెంటీ అంటే, ఇలా పిచ్చిగా మాట్లాడే వాళ్ళే ఆ టి.వి వాళ్ళకి నచ్చుతారు. స్పష్టంగా మాట్లాడే వాళ్ళు ఉన్నా వాళ్ళకి అవసరం లేదు.
ఇలా , కట్టుకునే బట్టల నించి, మాట్లాడే బాష దాక, అన్నీ కూడా, పక్క వాడిని చూసి అనుకరిస్తే, మన వ్యక్తిత్వం ఎందుకు? మన దేశం కళలకి పుట్టినిల్లు, అలాంటి ఈ దేశం లో, దక్షిణ భారతం ఈ కళలకి బాగా ప్రశిద్ధి. యెక్కడో పుట్టిన వాళ్ళు ఇక్కడకి వచ్చి సంగీతము, నాట్యము ఇత్యాది కళలు నేర్చుకుంటుంటే, మనం ఆ సాంప్రదయాల మధ్య పుట్టీ , అటూ పాశ్చాత్తానికి,ఇటు భారతీయతకు , రెండిటీకి దగ్గర అవలేక పోతున్నాం అంటే అది మన దౌర్భాగ్యమే.
మార్పు అవసరమే, కాని మన సంస్కృతి సంప్రదాయాలని సమూలంగా అంతం చేసే మార్పు వినాశకారిణి. ఈ పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ ఆ కోవలోకే వస్తాయి. అక్కడికి వెల్లేవాళ్ళలో చాలా మందికి, ఆ ఖర్చు పెట్టే డబ్బు యొక్క విలువ తెలియదు. అమ్మయిలతో తిరగటమే స్వర్గం అనుకునే ప్రబుద్ధులూ ఉంటారు. అలానే వెంట అబ్బాయి లేనిదే రోజు గడవని అమ్మాయిలూ వున్నారు. ఇవన్నీ కూడా మన సాంప్రదాయం లో లేవు. పాశ్చాత్త దేశాలనించి తెచ్చుకున్న అలవాట్లే. యెక్కడైన మంచి నేర్చుకుని చెడు వదిలెయాలి. మనం చెడుని గ్రహించి మంచిని వర్జించటంలొ మొట్టమొదట ఉంటాము.
ఇంతా యెందుకు వ్రాశాను అంటే, కనీసం ఒక్కరైనా వాళ్ళ మనస్సాక్షి తో మాట్లాడి, మన సమాజం లో మన సంస్క్రుతి గొప్పతనం తెలియటానికి నెనేమైనా చేస్తున్నానా అని ఒక్క సారి ప్రశ్నించుకుంటారేమో అన్న ఒక్క చిన్న ఆశ.
ఇక ఉంటాను.
విధేయుడు...
వంశీ కృష్ణ కార్తీక్
9908527444