
నాకు అన్నమాచార్య కీర్తనలు అంటే యెనలేని గౌరవం. నేను ఆయన్ని నాకు గురువుగా భావిస్తాను.ఆయన కీర్తనల ప్రభావం నా జీవితము పై బాగా ఉంది. మన జీవితపు క్రమంలో జరిగే ప్రతీ సన్నివేశాన్ని, ఒక అన్నమాచర్య కీర్తనలొ మనం చూదచ్చు...
నాలుగు వేదాలని, ముప్పది రెండు వేల సంకీర్తనలుగా మలచి, మన మానవాళికి అందించిన మహనీయుడు ఆయన..ఎన్ని చెప్పినా, యెంత పొగడినా, ఆయనకి తక్కువే.
ఆయన, శ్రీ రామనుజ సాంప్రదాయం అనుసరించి, శ్రీనివాసుని చేరే క్రమంలో రాసిన కీర్తనలు, వారికి శ్రీ వేంకటేశ్వరుని యందు ఉన్న అచంచల మైన భక్తి ప్రపత్తులను చాటుతాయి. అంతే కాక సాంప్రదాయం పట్ల ఉన్న భక్తిని, విశ్వాసాన్ని కూడా చాటి చెప్తాయి...
మచ్చుక్కి ఒక రెండు వరుసలు అనుకుందాం..
నీవలన కొరతేలేదు మరి నీరు కొలది తామరము
ఆవల భాగీరధీ నది దరి బావుల ఆ జలమే ఊరిన యట్లు
శ్రీ వేంకట పతి నీవైతే నను చేకొని యున్న దైవము..
నీ వలనే నీ శరణనియదను ఇదియే పరతత్వము నాకు....
చాలదాండి ఈ పాట? యెంత మాత్రమున యెవ్వరు దలచిన అంత మాత్రమే నీవు....ఈ వరుసకి ఉన్న గొప్పదనన్ని, ఇంత సరళీకృత భాష లో యెవ్వరూ రాయలేరు, రాయలేదు, రాయబోరు..
అన్నమాచార్య కీర్తనలను వినేవారికి, ఒక్క విన్నపం...గురువుగారు రాసిన కీర్తనలను,వారి సాంప్రదయాన్ని గౌరవించి వింటేనే, మనకి వాటి మూలార్థం గోచరిస్తుంది...
విన్నామా, అని వింటే అర్థం కాదు,,,ఇప్పుడున్న ఇంకొక పెద్ద ముప్పు యేంటంటే, వీరి కీర్తనలను విశ్లేషించేవాళ్ళు, విశిష్తాద్వైత వ్యతిరేకులు...(ఇంకో బాషలో చెప్పాలంటే అద్వైతులు)...మరి వారికి నచ్చని సాంప్రదాయాన్ని వారు విశ్లేషిస్తుంటే ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి...
మనసులో ఉన్న బాధ బయట పెట్టుకోగలిగాను...
అద్వైతులు యుద్ధానికి వస్తారేమో చూడాలి
జై శ్రీమన్నరాయాణ
భవదీయుడు
వంశీ కృష్ణ కార్తీక్
vamsi.vallurik@gmail.com